Friday, September 13, 2024

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Must Read
  •  ధాన్యం కొనుగోలుపై రైతుల‌కు శుభ‌వార్త ?

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ నేడు శుభవార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. రైతులంద‌రికీ ఊరట కలిగించేలా ధాన్యం కొనుగోళ్లపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాక కేబినెట్ భేటీ త‌ర్వాత స్వ‌యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుపై కీల‌క ప్రకట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

రైతుల‌కు శుభ‌వార్త‌

యాసంగిలో వ‌రి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్ర‌క‌ట‌న చెప్పాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్రానికి విధించిన డెడ్ లైన్ మ‌రికాసేప‌ట్లో ముగియ‌నుంది. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై కేంద్ర ఆహార ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ కార్యదర్శి సుదాన్షు పాండే, హైదరాబాద్‌లో ఎఫ్‌సీఐ రీజియన్‌ మేనేజర్‌ దీపక్‌శర్మ స్పందించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. దీంతో బంతి మ‌ళ్లీ మొద‌టికొచ్చి రాష్ట్ర ప్ర‌భుత్వం కోర్టులోనే ప‌డింది. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో పండించిన అన్ని రకాల ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే సేకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇవాళ కేసీఆర్ చేయనున్న ప్రకటన రైతులకు శుభవార్త కానుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img