Friday, September 13, 2024

దేశానికే ఆదర్శం దళితబంధు

Must Read

 

  • దళిత కుటుంబాల ఆర్ధిక అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి
  • లబ్ధిదారులు లాభదాయ‌కమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలి
  • ప‌ర‌కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నార‌ని కొనియాడారు.
  • గురువారం అంబేద్కర్ జయంతి సందర్బంగా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన ఆరుగురు దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.
  • ఈసందర్బంగా ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
  • దళితుల పట్ల సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపుమాపడమే దళితబంధు పథకం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, లాభదాయ‌కమైన యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img