Monday, September 9, 2024

భూపాల‌ప‌ల్లిలో కాంగ్రెస్ జోష్‌

Must Read
  • బీఆర్ఎస్‌ను వీడిన మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు
  • హ‌స్తం పార్టీలో 250 మంది చేరిక‌
  • కోల్‌బెల్ట్‌పై కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తాం: గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మ‌రో భారీ షాక్ త‌గి లింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట కోలుకోలేని ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింది. ద‌స‌రా పండుగ రోజే ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిల‌ర్లతోపాటు టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మండ సంపత్ గౌడ్ టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకోగా, తాజాగా మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ కు చెందిన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి, సుల్తాన్ పూర్ గ్రామాల మాజీ సర్పంచులు నాండ్రె రాజయ్య, గంధం కృష్ణారావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో రెండు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు సుమారు 250 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేర‌కు గణపురం మండలం చెల్పూరులోని లక్కం జయచంద్ర గార్డెన్స్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు వీరే..
వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుండి.. నాండ్రె రాజయ్య (మాజీ సర్పంచ్), బానోత్ మొగిలి (మాజీ కారోబార్), దైనంపల్లి వెంకన్న (మాజీ వార్డు మెంబర్), పల్లెబోయిన కుమార్ (ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు), గాజే వీరన్న(బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు), కాడవేన ఎర్రకొమురు, ఒరంగంటి రాజన్న, కాడవేన ఐలయ్య, బీ స సాంబయ్య, బండారి శ్రీనివాస్, పల్లెబోయిన విజేందర్, ఇప్ప రమేష్, బానోతు రాజు నాయక్, పాలకుర్తి తి రుపతి, బానోతు మొగిలి (డిష్), బానోత్ సూర్యనాయక్, బైరపాక రాజు, మార్త రాజు, బీస రవి, బానోత్ రవీం దర్, బొంతల రాజు, పోగు చిరంజీవి, కాడవేన నవీన్, కాడవేన లక్ష్మణ్, దువ్వ బిక్షపతి, బోడ పాపయ్య, వే ముల తిరుపతి తదితరులున్నారు.
సుల్తాన్ పూర్ గ్రామం నుండి..
గంధం కృష్ణారావు (మాజీ సర్పంచ్), ఓరుగంటి రాజేందర్ (వార్డు సభ్యుడు), గట్టు బిక్షపతి, ఓరుగంటి వెంకటేష్, అంబాల కుమారస్వామి, గాజర్ల రామస్వామి, ఓరుగంటి బిక్షపతి, ముక్కెర సాంబయ్య, మార్క వీరస్వామి, వేముల మల్లయ్య, బొంగు రవి, పులి శివకృష్ణ, అంబాల శ్రీరామ్, మార్క నాగరాజు, మంద శశి, కో డూరు సన్నీ, మార్క గౌతమ్, గండు సిద్ధార్థతో పాటు మరికొందరు చేరారు. వీరందరికీ గండ్ర సత్యనారాయణ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కుటుంబంలోకి చేరిన వారికి ఎ ల్లవేళలా అందుబాటులో ఉంటూ, కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చేరికల కార్యక్రమంలో జీఎస్సార్ వెంట ఉమ్మడి రేగొండ మండల మాజీ జెడ్పీటీసీ పత్తి వినోద- ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్, ముఖ్య నాయకులు సూర బాబురావు, చిగురుమామిడి కుమారస్వామి, కాశెట్టి రాజయ్య, పత్తి తిరుపతి, బోయిని వినోద్, బోయిని కుమారస్వామి, కాడవేన యుగేంద‌ర్, రెండు గ్రామాల అధ్యక్షులు కాడవేన వెంకటేష్, కానుగుల తిరుపతి, సుల్తాన్పూర్ గ్రామ యూత్ నాయకుడు మంద శివతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img