ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌డ్డి చేతులమీదుగా ప్రధానం
అక్షరశక్తి, మెదక్ : మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం బీసీకాలనీలోని ప్రైమరీ పాఠశాలలో ఉ పాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న మాలోత్ రాధాబాయి జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అ వార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో రామాయంపేట ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌డ్డి, కలెక్టర్ రాజర్షి షా, డీఈవో రాధాకిషన్ చేతులమీదుగా అవార్డు స్వీకరించారు. 2005 నుంచి ఒకే మండలంలో సుదీర్ఘంగా విధులు నిర్వహిస్తున్న రాధాబాయి విధి నిర్వహణలో పలువురి ప్రశంసలు అందుకున్నారు. కాగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు స్వీకరించిన సందర్భంగా రాధాబాయిని తోటి ఉపాధ్యాయులు ఏ స్వాతి, వీణాకుమారితోపాటు కురవి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు, చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉ న్నత అవార్డులు పొందాలని ఆకాంక్షించారు.
Must Read