ఘన స్వాగతం పలికిన ప్రతినిధులు
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది సేపటి కింద హన్మకొండ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు.
ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిష్యత్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులంతా మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
కాగా..కేటీఆర్ పర్యటన సందర్భంగా మొత్తం గులాబీమయం అయింది. ఫ్లెక్లీలు, కటౌట్లు, భారీ స్వాగత తోరణాలతో నిండిపోయింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.