- ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
- ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండలో మరోమారు ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంతకాలంగా యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం హన్మకొండలోని పోచమ్మ గుడి వద్ద కాపుకాసి యువతిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు హుటాహుటిన అనూషను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అనూషను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.