ఓ(గో)ల్డ్ ఫ్రెండ్….!

ఓ(గో)ల్డ్ ఫ్రెండ్....!!   చిన్ననాటి సర్కారు బడిలో చదివిన ఒక తరం జ్ఞాపకాలు ప్రకృతికి హాని చెయ్యని, చెదలు పట్టని సంచిలో మూటకట్టి ఉన్నాయి. వాటిలో ఉండే గవర్నమెంటు పుస్తకాలను తడిమి చూసినప్పుడు ఇన్ని పాఠాలా అని బరువుగా నిట్టూర్చిన రోజు, నిమ్మ పిప్పారమెంటు దాచుకున్న సంచి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. జుబ్బల సంచి మెడకేసుకొని, మొదటి బడి గంట కొట్టక ముందే తొందరపడి బయలుదేరిన మిత్రతరం మనదే కదా!!   స్నేహితులతో కలిసి ఇంటి నుండి బడికి వెళ్తూ చెప్పుకున్న ముచ్చట్లు, ప్రతీ...