AKSHARA SHAKTHI
Date of Publish : 16 August 2026, 5:22 am Posted by : AKSHARA SHAKTHI

సీఎం పర్యటనకు ఇంత భయమా బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

*ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు….

ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో ఆత్మకూర్ మండలంలో బీజేపీ నాయకులను,ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని, ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని బీజేపీ ఆత్మకూర్ మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు బీజేపీ నేతలను చూసి ఇంత భయమా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీజేపీ నాయకులను పోలీసులతో ముందస్తుగా అరెస్టు చేయించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.

ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేసి దామెర పోలీస్ స్టేషన్లో లో పెట్టినారు ఇంత  నిరంకుశ పాలనను ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల సందర్భంగా ఎందుకు హామీలు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు భయపడాలి ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించని బీజేపీ నాయకులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

“ప్రశ్నించే బీజేపీ గొంతును అరెస్టులతో అణచివేయాలని చూస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమ మాత్రమే. ఒక్క బీజేపీ కార్యకర్తను అరెస్టు చేస్తే వందల గొంతులు ప్రశ్నిస్తాయి.” అని శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా అన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులను భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతుందని హెచ్చరించారు.

“అరెస్టులు చేయండి… నిర్బంధాలు చేయండి… కానీ బీజేపీని ఆపడం మీ వల్ల కాదు. ప్రజల పక్షాన ప్రశ్నించడం మా హక్కు… ప్రజల కోసం పోరాడటం మా బాధ్యత.”

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ భయాన్ని, అసహనాన్ని, నిరంకుశ వైఖరిని బహిర్గతం చేసిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.అరెస్ట్ అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం నీరుకుల్ల సర్పంచ్ తడక నీరజ ఉద్యమకారుల ఫోరం ఆత్మకూర్ మండల అధ్యక్షులు ఎండి బాబుమియా బిజెపి జిల్లా నాయకులు ex. mptc మానగాని శంకర్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రవ్వ శివ ప్రసాద్ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.