AKSHARA SHAKTHI
Date of Publish : 16 August 2026, 10:03 am Posted by : AKSHARA SHAKTHI

సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

 

అక్షరశక్తి,మేడారం: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. బిచ్కుంద నుంచి మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, విప్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్ రెడ్డి, కోరెం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. అనంతరం వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పలువురు వితంతు, ఒంటరి మహిళలకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.