రేవూరి రాజకీయం….!
రేవూరి రాజకీయం...! *ఎమ్మెల్యే నయా రాజకీయ నీతి? అక్షరశక్తి,పరకాల: పరకాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించకపోవడం కాంగ్రెస్ పార్టీలో తాజా చర్చకు దారి తీస్తున్నది. పరకాలలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉండడానికి ఇనగాల చేసిన కృషిని తగ్గించే ప్రయత్నాలకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడా? భవిష్యత్ రాజకీయాలకు ఆయనను దూరం చేసే ప్రయత్నాలకు ఆజ్యం పోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కీలక నేతను సీఎం సభకు దూరంగా ఉంచడం వెనుక...