తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ ఆవిర్భావం

రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరెల్లి కిరణ్ కార్యదర్శిగా పల్లెబోయిన నాగరాజు కోశాధికారిగా పల్లె రవి వంశీ మోహన్ అక్షరశక్తి,హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ (టీడీఎంయూ) నూతనంగా ఆవిర్భవించింది. యూనియన్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ 468/2026గా నమోదైంది.టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడిగా అరెల్లి కిరణ్, రాష్ట్ర కార్యదర్శిగా పల్లెబోయిన నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కౌడగాని మోహన్‌రావు, కోశాధికారిగా పల్లె వంశీ మోహన్, సహాయ కార్యదర్శిగా బూర నగేష్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి,...