నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్
అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోగా.. అక్కడే ఉన్న కానిస్టేబుల్ దిలీప్ క్షణం కూడా ఆలోచించకుండా ఆమె ప్రాణాలను కాపాడేందుకు బావిలోకి దిగి సాహసోపేతంగా రక్షించారు. విధి నిర్వహణలోనే కాదు.. ఆపదలో ఉన్న ఓ నిండు ప్రాణానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు యువతి బావిలో పడిపోయిన విషయం తెలుసుకున్న దిలీప్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. బావి లోతుగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా...