ఏసీబీ వలలో మైన్స్ అధికారి

భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇళ్లపై ఏసీబీ సోదాలు   అక్షరశక్తి,భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హైదరాబాద్‌లోని బోడుప్పల్‌తో పాటు సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో సుమారు 12 చోట్ల ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు...