అగ్ని ప్రమాదంలో ఆపన్నహస్తం ఆగిపోయింది
లింగాల కేదారి దంపతుల మృతి ఉద్యమకారులకు ఉచిత టీ, టిఫిన్, భోజనాలు అందించిన సేవామూర్తి ‘ఫుడ్ వేస్ట్ చేయొద్దు’ అంటూ ప్రజల్లో చైతన్యం.. మోదీతోనూ ముచ్చటించిన కేదారి అక్షరశక్తి, హనుమకొండ: హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని లింగాల కేదారి హోటల్‌లో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఓరుగల్లు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. హోటల్ యజమాని లింగాల కేదారి, ఆయన భార్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా కేదారి మృతి చెందారు. ఆయన భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది....