హసన్‌పర్తిలో మహిళ అదృశ్యం కేసు.. దారుణ హత్యగా తేల్చిన పోలీసులు
వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కిన నిందితుడు అక్షరశక్తి, హసన్‌పర్తి, సెప్టెంబరు 11 : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన కార్ డ్రైవర్, రైతు వొద్దిరాజుల బసవరాజ్ (27) అనే యువకుడు తౌటం స్వప్న (40)ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని శుక్రవారం అంబాల–కమలాపూర్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.....