నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కలకలం…
*తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. *భూముల మ్యుటేషన్‌కు యత్నం.. అక్షరశక్తి, వరంగల్: ఖిలా వరంగల్ మండలంలో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు ప్రభుత్వ కార్యాలయ సీలును దుర్వినియోగం చేసి నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. *రికార్డుల పరిశీలనతో వెలుగులోకి.. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం మెహరున్నిసా బేగం పేరిట 2026 జనవరి 8న జారీ చేసినట్లు పేర్కొంటూ C/3223/2026 డి.డిస్ నంబర్‌తో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రూపొందించారు. ఈ పత్రం నిజమైనదో...