– పేదలకు న్యాయం చెయ్యమనడం మా తప్పా
– వైఎస్సార్ నగర్ ఇండ్లు ఆక్రమించుకున్న వారి పక్షాన కాంగ్రెస్
– మేము ఎప్పుడూ పేదల పక్షమే
– మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
అక్షరశక్తి, హనుమకొండ: కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులను, గుడిసెవాసులను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు. కాజీపేటలోని వైఎస్సార్ నగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పేదల అరెస్ట్ అత్యంత హేయం. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శాంతియుతంగా తమ హక్కుల కోసం ప్రశ్నించిన పేద గుడిసెవాసులను, మరీ ముఖ్యంగా మహిళలను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం ఇదా ప్రజా పాలనా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు ఆ హామీని నెరవేర్చాలని అడిగితే అక్రమ అరెస్టులతో ప్రతిపక్ష నాయకులపై కేసులు అక్రమ అరెస్టుల. .. ఇదా పేదల ప్రభుత్వం అని చెప్పుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరు అని దుయ్యబట్టారు.

దశాబ్దాలుగా వైఎస్సార్ నగర్‌లో తలదాచుకుంటున్న పేదల భూములపై కన్నేసిన కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని, పేదలను ఖాళీ చేయించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను, వైఎస్సార్ నగర్ మహిళలను, కాలనీవాసులను పోలీసులు తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలబడి క్షేత్రస్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అరెస్ట్ అయిన వారిలో మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు, తండమళ్ళ వేణు, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, దువ్వ కనకరాజు, బెదరకోట రంజిత్ కుమార్ , బరిగెల వినయ్ , పాలడుగుల శివ కుమార్, నయీమ్ జుబేర్ , మమ్మద్ హుస్సేన్, సిద్ధు, కొండ్ర శంకర్, వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల్లో హరినాథ్, మంజుల, సతీష్ ఉన్నారు.
కాగా అరెస్ట్ అయిన వారిని మొదట కాజీపేట పోలీస్ స్టేషన్ ఉంచగా బుధవారం ఉదయం హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు.