భట్టి పర్యటన.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

- ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం - అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు - బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు, జిల్లా కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్‌లను హనుమకొండ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు....