ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా బీజేపీ మహా పాదయాత్ర
మడికొండ చౌరస్తా నుంచి చలో కరీంనగర్ యాత్రకు శ్రీకారం బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు అక్షరశక్తి, మడికొండ: దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘చలో కరీంనగర్’ మహా పాదయాత్రకు గ్రేటర్ వరంగల్ మడికొండ చౌరస్తా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మడికొండ...