అక్షరశక్తి , హన్మకొండ క్రైమ్ : హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారం గ్రామంలో దొంగలు భీబత్సం సృష్టించారు. బాధితులు, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీ మారం బొడ్రాయి సమీపంలో నివాసం ఉండే ఎండీ సాధిక్ పాషా అనే వ్యక్తి తన కుటుంబంతో ఈనెల 8న హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా.. ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. బీరువా తాళాలు పగలగొట్టి, ఇంట్లోని 24 తులాల బంగారం గుర్తు దొంగలించినట్లు కేయూ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న కేయూ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.