Saturday, September 7, 2024

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ లకు ఏకైక యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీ కి 500 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంజయ్, రాహుల్,శ్రీకాంత్, భరత్,అశోక్, ప్రవీణ్, అఖిల్ దీప్, మనీష్ తదితరులు పాల్గొన్నారు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్‌ కాలేజీలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేస్తూ, ఖాళీగా ఉన్న అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img