Saturday, July 27, 2024

తెగిప‌డిన కాళ్లు… చేతులు.. ! బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పెను విషాదం

Must Read

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా… ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనానికి చుట్టు ప‌క్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ జన సమీకరణ చేసింది. పక్కనే వంటలు చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పటాకులు పేల్చారు. కొన్ని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పై పడటంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img