గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. గగన్‌యాన్ ప్రోగ్రామ్‌కు వినియోగించనున్న క్రియోజనిక్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 720 సెకన్లపాటు ఈ పరీక్ష కొనసాగింది. తమిళనాడులోని మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్సన్ కాంప్లెక్స్‌లో క్రియోజనిక్ ఇంజిన్ అర్హత పరీక్ష చేపట్టింది.