Tuesday, June 25, 2024

ఢిల్లీ గులాములకు చెప్పులు మోసే బానిస

Must Read
  • వరంగల్‌లో బండి సంజ‌య్ ఫ్లెక్సీల కలకలం
  • మండిప‌డుతున్న బీజేపీ శ్రేణులు
    అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్‌లో టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. నేను ఢిల్లీ గులాముల‌కు చెప్పులు మోసే బానిస‌ను అంటూ బండి సంజ‌య్ చెప్పులు మోస్తున్న‌ట్లు మార్పింగ్ చేసిన ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించారు. న‌గ‌రంలోని హెడ్ పోస్టాఫీస్ కూడ‌లితోపాటు రాత్రికి రాత్రే వివిధ సర్కిళ్లలో ఏర్పాటు చేశారు. విష‌యం తెలుసుకున్న బీజేపీ నేత‌లు ఫ్లెక్సీలను చించివేశారు. టీఆర్ఎస్ నేతలు కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర వేషాలు వేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ విచ్చేసిన విషయం విధితమే. ఈ సమయంలో అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్‌తో పాటు, పలువురు టీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బండి సంజయ్ కూడా వివరణ ఇచ్చారు. అమిత్ షాకు చెప్పులందివ్వడం అంత పెద్ద ఇష్యూనా అన్న ఆయన.. తమకు అమిత్ షా ఆదర్శనేత అని, అలాంటి ఆయనకు చెప్పులందివ్వడం పెద్ద విషయమేం కాదని చెప్పారు. ఈ క్రమంలోనే తాము గులాములు కాదని, మజ్లిస్‌కు సలాం కొట్టే వారసులు అసలే కాదని ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img