Monday, June 17, 2024

వ‌రంగ‌ల్‌లో దారుణం

Must Read
  • పాత భ‌వ‌నం కూల్చేస్తుండ‌గా ప్ర‌మాదం..
  • ఇద్ద‌రు కార్మికులు మృతి.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ న‌గ‌రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం చార్‌బౌలిలో ఓ పాత భ‌వ‌నం కూల్చి వేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. శిథిలాల కింద ఉన్న సాగ‌ర్, సునీత మృత‌దేహాల‌ను పోలీసులు బ‌య‌ట‌కు వెలికితీశారు.

మరో ఇద్ద‌రు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img