Sunday, September 8, 2024

ఐక్య ఉద్యమాలతోనే బీసీ హక్కుల సాధన

Must Read

– చట్టసభల్లో వాటా కోసం దేశ వ్యాప్త ఉద్యమం
– ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
– జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు రమణ

అక్ష‌ర‌శ‌క్తి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: ఐక్య ఉద్య‌మాల‌తోనే బీసీ హ‌క్కుల సాధ‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, జాతీయ బి.సి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో జరిగిన జాతీయ బి.సి చైతన్య సమితి రాష్ట్ర స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా, చట్టసభల్లో బి.సి వాటా కోసం బి.సి లు దేశ వ్యాప్త ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బి.సి వాటా కోసం తెలంగాణలో 400 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన సాయిని నరేందర్, వెలుగు వనిత, చాపర్తి కుమార్ గాడ్గే లను రమణ తదితరులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ వెలుగు వనిత, జాతీయ సభ్యుడు చాపర్తి కుమార్ గౌడ్గే, జాతీయ బి.సి చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి కోల ఏడుకొండలు, రాష్ట్ర యువజన అద్యక్షులు దుప్పుల శివాజీ, తేనె నాగేశ్వర్ రావు, గొడుగు శంకర్, వెంకటయ్య, మోక రవి, సహజీవన్, రాజ్ కమల్, సందే మాధవరావు, నరసింహ రాజు, వెలుగు యామిని తదితరులు పాల్గొనగా కళాకారులు బుల్లెట్ వెంకన్న, చంద్రకళ, నరసింహసామి పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img