Monday, September 16, 2024

విద్యార్థి సంఘ నాయకులపై చర్యలు తీసుకోవాలి

Must Read

అక్షరశక్తి హనుమకొండ: కలెక్టరేట్, కొందరు విద్యార్థి సంఘాల పేర్లు చెప్పుకుంటూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలను డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య కమిటీ నాయకులు శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ప్రైవేట్ జూనియర్ కళాశా లల యాజమాన్య కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీఏ, బీఎస్ఎఫ్, ఏఐఎస్బీ విద్యార్థి సంఘాల అధ్యక్షులు తమ కళాశాలలకు వచ్చి చందాల వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. చందా ఇవ్వని కళాశాలల ముందు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనే పేరుతో ధర్నాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. నిరుద్యోగులైన తాము ప్రైవేట్ కళాశాలలు పెట్టుకుని ఉపాధి పొందుతూ ఎంతో మంది నిరుద్యోగుల కు ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. విద్యా ర్థి సంఘాల నాయకులు, కొందరు కుల సంఘాల నాయకులు ఆర్టీఏ యాక్ట్ కింద నోటీసులు ఇస్తూ తమను ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. వెంటనే ఈ విద్యార్థి సంఘాల నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టరు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ ను  కలిసిన వారిలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి రాజు, గౌరవ సలహాదారులు గౌరు తిరుపతిరెడ్డి, కుమార్, రాజిరెడ్డి, రాంమూర్తి, కరుణాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, తాళ్లపల్లి స్వామి తదితరులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img