తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ బలవన్మరానికి పాల్పడ్డాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో ఒత్తిడితోనే శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శివకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. కాగా రాష్ట్రంలో ఏడాదిగా సగటున 350 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా పరీక్షల ఒత్తిడి, చదువు భారంతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. గత 20 రోజుల్లో ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థుల కఠిన నిర్ణయం బాధిత కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతోంది.