అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం స్కూల్లో పిల్లలందరూ కలిసి బతకమ్మలను రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. పిల్లలు, టీచర్లు అందరూ కలిసి కోలలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నరేష్ చంద్ర భారత్, ప్రిన్సిపాల్ వీణ నరేష్ చంద్ర మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు రాజలక్ష్మి, సంధ్యారెడ్డి, సుధీన, శారద, సునీత, నాజ్ తదితరులు పాల్గొన్నారు.