Friday, September 13, 2024

భూపాలపల్లిలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

Must Read

– కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఐదుగురు కౌన్సిలర్లు
– టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ కూడా..
అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట కోలుకోలేని ఎదురుదెబ్బ‌.. ద‌స‌రా పండుగ రోజే ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిల‌ర్లు కురిమిల్ల రజితశ్రీనివాస్, చల్లూరి మమతకమలాకర్, ముంజాల రవి గౌడ్, చల్ల రేణుకరాములు, తొట్ల సంపత్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మండ సంపత్ గౌడ్ హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నివాసంలో భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కౌన్సిల‌ర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… భూపాలపల్లిలో గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img