Sunday, September 8, 2024

అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలి

Must Read

-మంత్రి సీతక్క చొరవ చూపాలి!
-వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి
-ఏబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్
-అసైన్డ్ రైతులు చట్టం రద్దు కోసం ఉద్యమించాలి
-ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి పిలుపు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అసైన్డ్ భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తూ అసైన్డ్ భూముల చట్టం- 1977ను రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అందుకు రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ చూపాలని ప్రముఖ న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి (ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో ఏబీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విచ్చేసిన వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించి వాటిని పట్టా భూములుగా మారుస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి మాట్లాడుతూ అసైన్డ్ భూముల చట్టం రద్దయ్యి అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు, గిఫ్టు, మార్టిగేజ్, లీజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా జరగాలని, ఇందుకోసం రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ బుచ్చన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ల్యాదేల్ల అశోక్, జిల్లా ఇన్చార్జి కుర్రి దినాకర్, తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోరే రవి యాదవ్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్, ఏబీస్ నాయకులు బాల్య రవి, ఓరుగంటి ప్రశాంత్, పారునందుల శ్రీనువాస్, మారేపేల్లి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img