అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. రెండు రోజుల క్రితం ఎంజీఎంలో పేషంట్ కాసు రాములు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని ఆరోపిస్తూ లంబాడీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో సూపరింటెండెంట్ లంబాడీ కులస్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కులం పేరుతో దూషించాడని గుగులోతు తిరుపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతి ఫిర్యాదుతో మట్టెవాడ పీఎస్ లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.