Tuesday, June 18, 2024

కేసీఆర్‌కు బుద్ధొచ్చింది

Must Read
  • తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డ‌టానికి ముఖ్య‌మంత్రే కార‌ణం
  • సీఎం పేదల పక్షమో లేక భూస్వాముల పక్షమో ?
    తేల్చుకునే స‌మ‌యం ఆసన్నమైంది
  • మోడీ పాల‌న దేశానికే ప్ర‌మాద‌క‌రం
  • ప్ర‌జా స‌మ‌స్య‌లే మా ఎజెండా..
  • మానుకోట బ‌హిరంగ స‌భ‌లో
    సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కే నారాయ‌ణ
  • జిల్లా కేంద్రంలో ప్రజా పోరు యాత్ర .. ఎరుపెక్కిన మానుకోట‌

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డ‌టానికి కేసీఆరే కార‌ణ‌మ‌ని, ముఖ్య‌మంత్రికి బుద్ధి వొచ్చిందని, ఆయ‌న‌కు ఉచ్చు బిగిసాక కమ్యూనిస్టుల అవసరం ఏర్ప‌డింద‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కే నారాయ‌ణ అన్నారు. కేసీఆర్ నువ్వు పేదల పక్షమో లేక భూస్వాముల పక్షమో ? తేల్చుకునే స‌మ‌యం ఆసన్న మైంద‌ని అన్నారు. తెలంగాణ‌లో బీజేపీని ఓడించడానికి ఎత్తుగడలో భాగంగా కేసీఆర్‌కు సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. లిక్క‌ర్ స్కాం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌విత మ‌హిళా రిజ‌ర్వేజ‌న్ అంశంపై ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే తాము మ‌ద్ద‌తిచ్చామ‌ని, మహిళా రిజ‌ర్వేష‌న్ల కోసం భార‌త క‌మ్మూనిస్టు పార్టీ చాలా ఏళ్లుగా పోరాడుతుంద‌ని అందుకే తాము క‌విత‌కు సంఘీభావం తెలిపామ‌ని పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపోరు యాత్ర ఆదివారం రాత్రి మానుకోటకు చేరింది. పట్టణంలో నిర్వహించిన బ‌హిరంగ సభలో డాక్టర్ నారాయణ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగిస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్రధానంగా అదానికి దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. ఈ విధానాలను నిలదీస్తున్నందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. హోంమంత్రి అమిత్ షాపై ఉన్న అత్యాచార కేసుల నుంచి ఆయనను కాపాడేందుకు 12 మందిని హతమార్చారన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 24 మందిపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఉదంతంపై ప్రతిపక్ష పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తిరిగి మోదీ హటావో దేశ్ కీ బచావో నినాదంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకు కలిసి పోరాడేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని తెలిపారు. మానుకోట ప్రాంతంలో ధర్మన్న యావత్ కుటుంబం సీపీఐకి అంకితం అయ్యిందని, ఆయన పేరు చిరస్మరణీయం అని నారాయ‌ణ కొనియాడారు.

ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్ష‌మే ..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజకీయ పార్టీలు ద్వంద వైఖరి అవ‌లంభిస్తే సీపీఐ మాత్రం
ప్ర‌జ ప‌క్షాన నిలించింద‌ని, వారి సెంటిమెంట్ గుర్తించి ఉద్య‌మానికి జై కొట్టింద‌ని నారాయ‌ణ అన్నారు.
ముందు వ‌రుస‌లో కోదండరాం, కేసీఆర్ తో భ‌జం కలిపి పోరాటం చేసింద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు విభజన హామీలపై ప్రజలను చైతన్యం చెయ్యడంలోనూ సీపీఐ ముందున్నదని, మా అజెండా ప్రజా సమస్యలు, అభివృద్ధి మాత్ర‌మే అని నారాయ‌న అన్నారు. సీపీఐ నేత అజయ్ సారధి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, మానుకోట జిల్లా కార్యదర్శి బీ విజయసారథి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిదునూరి జ్యోతి, నాయకులు న‌ల్లు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img