Thursday, September 19, 2024

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లాలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి లతో కలసి ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో రోజువారీగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమ నిర్వహణ పటిష్టంగా జరుగుటకు
మండల స్థాయిలో జిల్లా పరిషత్ సీఈఓ, డిఆర్డీఓ, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని అన్నారు. స్థానిక ప్రజా ప్రతి నిధులు, స్వయం సహాయక సంఘాలు, యూత్ మరియు వార్డు కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్‌ వ్యాధులు, ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్లలో పారిశుధ్య పనులతోపాటు, ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిస్తూ మురుగు కాలువలను శుభ్రం చేయించాలన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌ వేసి దోమల వృద్ధిని అరికట్టాలన్నారు. తాగు నీటి వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మంచినీటి ట్యాంకు శుభ్రత, మంచినీటి సరఫరా, నిర్ణీత మోతాదులో క్లోరికేషన్ చేసేలా చూడాలని, 300 చదనపు గజాల ప్లాట్ ఉన్న భవనాలు వర్షపు నీటి నిలువ ఏర్పాట్లను చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, గ్రామాలలో ఫివర్ సర్వే నిర్వహణ, దోమల నివారణకు అయిల్ బాల్స్ ను తయారు చేయించి చేసి మురుగు నీటి నిలువలలో వొదిలే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’పై విద్యార్థులకు వ్యాసరచన, పద్య గేయాల పోటీలు నిర్వహించి బహుమతులను అందించి ప్రోత్సహించాలని కలెక్టర్‌ డీఈవోకు సూచించారు. వన మహోత్సవం కింద గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ నిమిత్తం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలన్నారు. కుక్కల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాట్టిన ప్రతి మొక్క పేరు  ఫ్లై కార్డ్ ఏర్పాటు చేసి పేరు వచ్చేలా మొబైల్ సెల్ఫీ తీసి వెబ్ సైట్ meri life.nic.in లో అప్లోడ్ చేసిన అత్యుత్తమ ఫొటోకు బహుమతులు అందిస్తామని అన్నారు. జిల్లా లో పచ్చదనం పెంపొందించుటకు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ జిల్లా లక్ష్యాన్ని సాధించుటకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో కౌసల్యాదేవి, జెడ్పిసీఈఓ రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img