Thursday, September 19, 2024

ప్రమోటి టీచర్స్ తో సీఎం సమావేశం.. హర్షనీయం

Must Read

అక్ష‌రశ‌క్తి కాజీపేట : ఏళ్ల తరబడి తీరని సమస్యగా మారిన ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పించి.. ఈనెల రెండవ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రమోటీ టీచర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానుండడం పట్ల బీసీటియు హర్షం వ్యక్తం చేస్తుందని ఆ యూనియన్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల పట్ల ఉపాధ్యాయ లోకం సంతోషం వ్యక్తం చేస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలపై కనీసం మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగ నిపుణులతో చర్చలు జరపడం..
ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు సమావేశాలు కావడం… సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వంటి చర్యలతో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎస్జీటీలుగా నియమితులై అదే కేడర్ లో పదవీ విరమణ పొందిన వారు వేలాదిమంది ఉన్నారని తెలిపారు. ఇక తమకు పదోన్నతులు రావు.. ఇలాగే రిటైర్ అవుతామని విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం శుభ పరిణామం అన్నారు. ఈ పదోన్నతులతో హై స్కూల్ లోని పలు సబ్జెక్టుల టీచర్ల కొరత తీరిందన్నారు. ప్రమోటీ టీచర్స్ తో నిర్వహించే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధిపై తీసుకోనున్న చర్యలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యా శాఖపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డి పై ఉపాధ్యాయులు భారీ ఆశలు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంతో స్పౌజ్ సమస్య తీరుతుందని.. మహిళా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని తెలిపారు…
బడుల్లో శానిటేషన్ సమస్య తీరేలా.. ఉద్యోగ నియామకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్గా, స్కూల్ అసిస్టెంట్ నుండి హెచ్ఎం గా పదోన్నతులు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్ గా, జూనియర్ కళాశాల లెక్చర్స్ గా, మండల విద్యాశాఖ అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img