Saturday, September 7, 2024

పర్వతగిరి మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

Must Read

వరంగల్  పర్వతగిరి: 24 జూలై 2024 : వర్షాల కారణంగా చింతనెక్కొండలోని దెబ్బతిన్న చెరువు బండ్ మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో గల దెబ్బతిన్న చెరువు బండ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బండ్ కు సంబంధించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ బండ్ కు సంబంధించిన మరమ్మతు పనులను రెండు రోజుల్లోగా పూర్తిచేయాలని సాగునీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పర్వతగిరి లోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. హాస్టల్ లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి పాఠశాల విద్యార్థినిలతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థినులకు వండిస్తున్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు హాస్టల్లో అందిస్తున్న భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.

హాస్టల్ లో విద్యార్థినిలకు గీజర్ ద్వారా వేడి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని హాస్టల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్లో సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. సోలార్ విద్యుత్కు సంబంధించి వెంటనే మరమ్మతులు చేయించి నిరంతరం విద్యుత్తు సౌకర్యం ఉండే విధంగా చర్యలు చేపట్టాలని హాస్టల్ అధికారులకు సూచించారు. విద్యార్థినిలకు అందిస్తున్న చికెన్ భోజనం నాణ్యతగా ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు భోజన శాంపిల్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షించాలని అధికారులను ఆదేశించగా భోజనాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్షల నిమిత్తం వరంగల్ కు తరలించారు. అదేవిధంగా పర్వతగిరి వ్యవసాయ అధికారి కార్యాలయంలో రైతులతో కలెక్టర్ సమావేశమయ్యారు. రుణమాఫీ గురించి స్థానిక రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రైతు రుణమాఫీ వర్తించిందని, ఇంకా ఎంతమందికీ ఈ పథకం వర్తినుంచనుందనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ను కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో వర్షాల కారణంగా విద్యుత్తు అసౌకర్యం కలుగుతుందని అన్నారు. ఈ హాస్టల్కు ప్రత్యామ్నాయంగా విద్యార్థినులను పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సౌకర్యాలన్నీ కల్పించి వెంటనే విద్యార్థినిలను తరలించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో శంకర్, ఎంపీఓ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, సాగునీటిపారుదల శాఖ ఏఈ ప్రశాంత్, కాడబోయిన వెంకటస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img