Monday, September 9, 2024

ప్రజల గుండెల నిండా కాంగ్రెస్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: ప్రజల గుండెల నిండా కాంగ్రెస్ ఉంద‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 1వ డివిజ‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు దేవరకొండ ఐలేశ్వర్ అన్నారు. వ‌రంగ‌ల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థి క‌డియం కావ్య గెలుపు కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఆదేశాలనుసారం దేవరకొండ ఐలేశ్వర్ బుధ‌వారం ఇంటింటి ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నుండి రాష్ట్రంలో పాలన ప్రగతి పథంలో ముందుకు పోతుందని అన్నారు. ఎమ్మెల్యేలను ఎలా గెలిపించారో ఇప్పుడు ఎంపీలను కూడా అలా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఐలేశ్వర్ అన్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య గెలుపు పక్కా అని గ్రామంలోని ప్రతి ఇంటింటి ప్రచారంలో కావ్య గెలుపున‌కు ప్రతి ఒక్కరం కృషిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. విద్యార్థులను యువతను పెద్దలను కలుపుకొని గడపగడపకు ప్రచారం చేశారు. డివిజన్ నుండి పూర్తి మద్దతునిస్తూ అధికమైన మెజారిటీని ఇస్తామని కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశం బాగుపడుతుందని అన్నారు. తెలంగాణను ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంమే అని అన్నారు. వరంగల్ ఎంపీ సీటు గెలవడం పక్కా అని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చేలా ఉన్నాయని ప్రజలు సంతోషిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, ప్రజలకు అండదండగా ఉంటూ, ఆదుకునే పార్టీ కాంగ్రెస్ అని వారు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img