Sunday, September 8, 2024

రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద డేంజర్

Must Read

– రెండో ప్రమాద హెచ్చరిక జారీ
– గోదారి వరద ఉధృతిని పరిశీలించిన ములుగు జిల్లా ఎస్పీ శబరిష్

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతిని జిల్లా ఎస్పీ డా. శబరిష్ పరిశీలించారు. పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద ముప్పు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ ఉన్నామని మనో ధైర్యాన్ని కల్పించాలన్నారు. ఇప్పటికే పొంగి పొర్లుతున్న వాగులు నిలిచిపోయిన రాకపోకలు మార్గంలో ముందస్తుగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తూ పెరుగుతుండడంతో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మొన్నటిదాకా రెండో ప్రమాద హెచ్చరిక కు చేరువలో చేరి ఆ తర్వా త మళ్లీ తగ్గి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి మూడో ప్రమాద హెచ్చరిక కు చేరువలో చేరిన నీటిమట్టం పెరుగుతూ.. తగ్గుతూ వస్తోంది.
15.830 కి చేరగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే శ‌నివారం ఉదయం గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా 16.980.నుండి క్రమ క్రమంగా పెరుగుతూ..తగ్గుతూ వస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలుపు తున్నారు.
నీటిమట్టం 17.360 కి చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత వారం రోజుల నుంచి ఏటూరు నాగారం. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద వరద నీటి మట్టం మూడవ ప్రమాద హెచ్చరిక కు చేరువలో పెరిగి ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది
గత వారం రోజుల నుంచి ములుగు జిల్లా దిగువ ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలో మునిగే. ప్రమాదం ఉంది. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై ఎస్కే తాజుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img