Thursday, September 19, 2024

డిటెన్షన్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి – ఎస్ఎఫ్ఐ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ఈరోజు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ డిటెన్షన్ అనేది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ కాకుండా అదే తరగతిలో కొనసాగెలా వారి జీవితాన్ని చీకట్లోకి నెడుతుందని ఇప్పుడు అదే డిటెన్షన్ కు కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో చదివే ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల నుండి వచ్చిన 300కు పైగా విద్యార్థులు గురయ్యారని దానికి ముఖ్య కారణం వారికి డి టెన్షన్ పై కాలేజీ విధివిధానాలపై అవగాహన కల్పించకపోవడమేనని వెంటనే వారిని ఈ విద్యా సంవత్సరం 100% డిటెన్షన్ రిలాక్సేషన్ తో ప్రమోట్ చేసి తరగతిలోకి అనుమతించాలని డి టెన్షన్ కు గురైన విద్యార్థులు అంతా కూడా కాలేజీని వదిలి వెళ్లే పరిస్థితి ఉన్నదని ఒకవేళ అదే జరిగితే ఓవైపు కళాశాల ఉపాధ్యాయులు ఉపాధినీ కోల్పోవడంతో పాటు కళాశాల మూతపడే అవకాశం ఉన్నందున దీనిపై విభాగాధిపతులతో సమావేశమై విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆపై ఈ విధానం గురించి ఈ విద్యా సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఓరియంటేషన్ తరగతులు / స్వాగత సభలు నిర్వహించి కాలేజీ యొక్క రూల్స్ ఆఫ్ ప్రమోషన్ డి టెన్షన్ ఇతర విధానాల గురించి తెలియపరచాలనీ కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ బాధ్యులు అరుణ్ అజయ్ విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img