అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని హనుమకొండ తహసీల్దార్ ఆఫీస్ వద్ద స్థానిక ప్రజలు గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. శనివారం నాటి దీక్షలను ఆర్పీఐఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పసుల రవికుమార్, మహిళా అధ్యక్షులు డాక్టర్ సరిగొమ్ముల స్నేహలత ప్రారంభించారు.
ఈ దీక్షల్లో డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ అధ్యక్షులు ఎర్ర చంద్రమౌళి, ఓరుగంటి స్వామి, సౌరం రఘు, దరిగి రమేష్, కొయ్యడ కృష్ణ, మామిడి పెళ్లి సుధాకర్, డోబిల నర్సింహా, గద్దపాటి సాయికుమార్, కంకణాల దేవేందర్, ఎర్ర రూప, ఎండీ హుస్సేన్ బీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వర్‌రావు, 30 వ డివిజన్ కార్పొరేటర్ రావుల కోమల కిషన్, 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి శ్రవణ్ కుమార్ సంఘీభావం తెలిపారు.
Must Read