అక్షరశక్తి, ములుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్‌ను టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ ఎట్టి వెంకన్నకు ఇవ్వాలని ఆదివాసీ సంఘాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరాయి. ఈమేరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ఆదివాసీ సంఘాల సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న ఎట్టి వెంకన్నకు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఈసందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మానుకోట ఎంపీ టికెట్ ఆదివాసీ బిడ్డ అయిన ఎట్టి వెంకన్నకు కేటాయించినట్లయితే మా ఆదివాసీ సమాజం మొత్తం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఆదివాసీ ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం మానుకోట టికెట్‌ను అదే సామాజికవర్గానికి చెందిన వెంకన్నకు ఇస్తే గెలుపు సులువు అవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు, పొడెం రత్నం, ఈసం సుధాకర్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు తుడుం దెబ్బ రాష్ట్ర పోలిట్ బ్యురో పొడెం బాబు, ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షులు కోర్శ నరసింహమూర్తి, వాసం నాగరాజు, ఆదివాసీ నాయక పోడ్ ఇతర సంఘాల నాయకులు సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు.