Tuesday, September 10, 2024

హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం !

Must Read
  • రోడ్డు ప్రమాదంలో మహిళా ఉపాధ్యాయురాలు మృతి
  • కొన్నేళ్ల కిందటే భర్త మృతి… అనాథ‌లైన పిల్ల‌లు
    అక్ష‌ర‌శ‌క్తి, క‌రీంన‌గ‌ర్ : హెల్మెట్ ధ‌రించినా ప్రాణం ద‌క్క‌లేదు. రెడీమిక్స్ వాహనం రూపంలో మృత్యువు ఓ మ‌హిళా ఉపాధ్యాయురాలి ప్రాణాల‌ను క‌బ‌ళించింది. కాగా ఎనిమిదేండ్ల కింద‌ట తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణిచంగా, రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లి ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి ఇద్ద‌రు పిల్ల‌లు అనాథ‌లుగా మిగిలారు. ఈ విషాద ఘ‌ట‌న శుక్ర‌వారం క‌రీంనగ‌ర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్న బండ రజిత ఇల్లంతకుంట మండలం మోడల్ స్కూల్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్ర‌వారం ఉదయం తన స్కూటీపై పాఠ‌శాల‌కు వెళ్తూ మ‌ధ్య‌లో పద్మనగర్ లోని బైపాస్ రోడ్ ప‌క్కన తన వాహనాన్ని నిలిపే సమయంలో స్కూటీని రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రజిత స్వగ్రామం శంకరపట్నం మండలం గద్దపాక గ్రామం. మృతురాలి భర్త (ప్రస్తుత ) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ వ‌ద్ద అడ్వకేట్‌గా విధులు నిర్వహిస్తుండేవారు. 8 సంవత్సరాల కింద గుండెపోటుతో మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో ఇద్ద‌రు చిన్నారులు అనాథ‌ల‌య్యారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img