Saturday, September 7, 2024

ప్ర‌తీ ఒక్క‌రు మొక్క‌లు నాటాలి : ఎస్పీ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : వాతా వరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు అధికారులతో కలిసి ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించిన ఎస్పి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ
పచ్చటి మొక్కలు నాటడమంటే భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేన‌ని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని, నాటడంతోపాటు, వాటి సరంక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు ముందుడాలని, ప్రతి పోలిసు స్టేషన్ పరిధిలో నిర్ధేశిత మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీకాంత్, రత్నం, ఆర్ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img