అక్షరశక్తి, డెస్క్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన ఘటన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్. రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో నివాసముంటూ కూలి పనిచేసే రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి సదరు మహిళతో కలిసి మద్యం తాగిన అనంతరం ఆమె నివాసముండే భవనంపై నిద్రిస్తున్నాడు.
తన తల్లితో వివాహేతర సంబంధంపై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న సదరు మహిళ కుమార్తె తన ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డితో గొడవ పడింది. ఈ క్రమంలో తన ప్రియుడి సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు రామచంద్రారెడ్డిని తెనాలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
Must Read