Monday, June 17, 2024

చదివింది పదోతరగతి… చేసేది డాక్టర్ వృత్తి

Must Read
  • వ‌రంగ‌ల్ న‌గ‌రంలో 25ఏళ్లుగా డాక్ట‌ర్లుగా చ‌లామ‌ణి
  • ఇద్ద‌రిని అరెస్టు చేసిన పోలీసులు
  • వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ త‌రుణ్‌జోషి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్, మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. ఈ నకిలీ డాక్టర్ల నుండి రెండు నకిలీ వైద్యవిద్య సర్టిఫికేట్లతో పాటు ఒక లక్ష 28వేల రూపాయల నగదు, డాక్టర్ క్లినిక్‌ల‌ నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.
వరంగల్, హంటర్ రోడ్ ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, వరంగల్ చార్ బౌళి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ ఫెయిల్ అయినాడు. వీరు ఇరువురు మిత్రులు కావడంతో పాటు గతంలో అనగా 1997 సంవత్సరానికి ముందు నగరంలో ప్రముఖ డాక్టర్ల వద్ద సహయకులుగా సంవత్సరాల కాలం పనిచేసారు. వీరు ఇరువురుకి సహయకులుగా చాలా కాలం పనిచేయడంతో వైద్యం చేయడంలో అనుభవం రావడంతో వీరు సైతం డాక్టర్లుగా చలామణి అయి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నారు. ఇందుకు కోసం నిందితులు బిహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీర్ విశ్వవిద్యాలయము నుండి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికేట్ తో పాటు గుర్తింపు కార్డును ఐదు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసారు.

సంపాదించిన సర్టిఫికేట్ల సాయంతో ఇరువురు నిందితుల్లో ఒకడు ఇమ్మడి కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో వైద్యశాలను నిర్వహిస్తుండగా, మరో నిందితుడు రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్ బౌళి ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ సహయకులుగా పనిచేసిన అనుభవంతో నిందితులు తమ వైద్యశాలకు సాధారణ రోగాలతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసేవారు. ఒకవేళ రోగులు వ్యాధి తీవ్రత అధికంగా వుంటే నగరంలోని కార్పొరేట్ హాస్ప‌ట‌ళ్ల‌కు వెళ్లాల‌ని సూచించేవారు. నిందితులు నిర్వహించే వైద్యశాలలోనే మందులు దుకాణంతో పాటు రక్తపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వారి నుండి కూడా పెద్ద మొత్తం కమీషన్లు తీసుకోనేవారు.
ఈ నకిలీ డాక్టర్లు బాగోతం కాస్తా టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు వరంగల్ రిజినల్ ఆయుష్ విభాగానికి చెందిన వైద్యుల అధ్వర్యంలో ఈ నకిలీ డాక్టర్లు నిర్వహిస్తున్న వైద్యశాలలపై దాడులు నిర్వహించి నకిలీ డాక్టర్లను విచారించడంతో నిందితులు తాము పాల్పడుతున్న నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు.
ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, రిజినల్ డిప్యూటీ డైరక్టర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ రవినాయక్ టాస్క్ ఫోర్స్ ఇనన్స్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు లవణ్ కుమార్, శ్రీకాంత్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, సోమలింగం, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు సృజన్, నవీన్,సురేష్, శ్యాం, శ్రీధర్, శ్రీను,శ్రవణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img