వరంగల్ నిట్‌లో గల న్యూలేడీస్ హాస్టల్‌లో బీ-10 రూంలో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులంతా కళాశాలలో జరిగే ఈవెంట్‌కు వెళ్ళాక షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. యాజమాన్యం సమాచారం మేరకు హుటాహుటిన కళాశాలకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సుమారుగా రూ. 4 లక్షల అస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.