Sunday, September 8, 2024

కొరివీర‌న్న ఆలయానికి కొత్త శోభ‌

Must Read
  • క‌న్నుల‌పండువ‌గా ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌నోత్స‌వం
  • వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌నం
  • రామాలయంలోనూ ధ్వజ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న
  • మండ‌ల‌కేంద్రంలో పండుగ వాతావ‌ర‌ణం
    అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ :  కుర‌వి మండ‌ల కేంద్రంలోని భ‌ద్ర‌కాళీ స‌మేత వీర‌భ‌ద్ర‌స్వామి ఆలయం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం క‌న్నులపండువ‌గా సాగింది. అర్చ‌కుల వేద మంత్రోచ్ఛార‌ణల న‌డుమ వేలాది మంది భ‌క్తుల జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య బుధ‌వారం ఉద‌యం ఆల‌య ఆవ‌ర‌ణ‌లో వేద పండితులు ధ్వ‌జ‌స్తంభాన్ని ప్ర‌తిష్టించారు.
  • అనంత‌రం వీర‌భ‌ద్ర‌స్వామి, భ‌ద్ర‌కాళీ ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు, అభిషేకాలు జ‌రిపారు. వేల సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దీంతో ఆల‌య ప్రాంగ‌ణంతోపాటు ప‌రిస‌రాలు భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయాయి. వీర‌భ‌ద్ర‌స్వామి ఆల‌యంతోపాటు రామాల‌యంలోనూ నూత‌నంగా ధ్వ‌జ‌స్తంభాన్ని ప్ర‌తిష్టించారు. దీంతో కుర‌వి మండ‌ల‌కేంద్రంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img