Monday, September 9, 2024

టీఎస్‌పీఎస్సీలో మరో సంచలనం..

Must Read
  • గ్రూప్-1 పేపర్ కూడా లీక్..?
  • ఆందోళ‌న‌లో అభ్య‌ర్థులు !
  • పేప‌ర్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్
    తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ల లీకేజీ కేసులో ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న ప్ర‌వీణ్ గతంలో గ్రూప్ -1 ఎగ్జామ్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తూనే గ్రూప్ -1 పరీక్షలు రాసినట్లు తేలింది.
    ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్ష పేపర్ కూడా లీక్ చేశాడా ? అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో గ‌త అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. 2 లక్షల 86 వేల మంది అభ్యర్థులు గ్రూప్-1 ఎగ్జామ్ రాశారు. 1:50 నిష్పత్తిలో 25,050 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ తరుణంలో పేపర్ లీక్ ఘటన వారిలో ఆందోళన కల్గిస్తోంది. గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్లీ నిర్వహిస్తారేమోననే అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా మారింది. అటు పేపర్ లీక్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందులో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందన్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ప‌లు విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ప్రస్తుతం ప్రవీణ్ ఓఎమ్మాఆర్ షీట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో మాత్రం వైరల్ గా మారింది. కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం నిందితుల కాంటాక్ట్ లిస్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్ అయ్యారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img