Tuesday, September 10, 2024

మానుకోటలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌

Must Read
  • గులాబీ పార్టీకి గూడూరు పీఏసీఎస్ చైర్మ‌న్ చల్ల లింగారెడ్డి రాజీనామా
  • అదేబాట‌లో బొల్లెపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్‌.. వార్డ్ మెంబర్లు
  • ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ఊహించ‌ని షాక్‌

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: మానుకోటలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. హ్యాట్రిక్ సాధించి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ఊహించ‌ని షాక్ తాకింది. గూడూరు మండ‌లానికి చెందిన బీఆర్ఎస్ కీల‌క‌నేత‌, పీఏసీఎస్ చైర్మ‌న్ చల్ల లింగారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న‌తోపాటు రాజన్‌పల్లి, బొల్లెపల్లి గ్రామాల‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు వారి పదవులకు, పార్టీకి మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు. గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో లింగారెడ్డి, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వైఖ‌రిని నిర‌సిస్తూ ఆయ‌న‌పై వ్యతిరేకతతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. కార్య క్రమంలో బొల్లెపల్లి వార్డు మెంబర్లు, రాజంపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ పార్టీ కార్యదర్శితోపాటు ముఖ్య నాయకులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. వీరితో పాటుగా మండ‌లానికి చెందిన మ‌రికొంద‌రు బీఆర్ఎస్ ముఖ్య నేత‌లు కూడా త్వ‌ర‌లోనే పార్టీని వీడుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా వీరంతా నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img