Monday, September 9, 2024

పిల్ల‌ని వెతికి పెట్టండి..

Must Read

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌తో అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఈ హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించినట్లుగా ఆమధ్య ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యంగ్ హీరో మ‌రో అప్‌డేట్ ఇచ్చాడు.

‘ఇంకా రెండు రోజులే ఉంది. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్‌ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి. ఇంకా రెండే రోజులుంది. ఒకే ఒక్క సంబంధం చూడండి. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టడంలో సాయం చేయండి. #HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో మీ సూచనలు తెలియజేయండి’ అంటూ ఓ వీడియో ట్వీట్‌ చేశాడు. అయితే.. విశ్వ‌క్‌సేన్ రెండు రోజుల్లో ఏం స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడు..? అంటూ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img